జెస్సీని ఇంటి నుంచి బయటికి పంపించిన బిగ్ బాస్!

  • వర్టిగో సమస్యతో బాధపడుతున్న జెస్సీ
  • జెస్సీకి వైద్య చికిత్స అవసరమని గుర్తించిన బిగ్ బాస్
  • జెస్సీ వెళుతుంటే కన్నీటిపర్యంతమైన షణ్ముఖ్, సిరి
  • ప్రోమో విడుదల చేసిన స్టార్ మా
బిగ్ బాస్ ఐదో సీజన్ కంటెస్టెంట్ల హోరాహోరీ పోరు కారణంగా రసవత్తరంగా సాగుతోంది. అయితే బిగ్ బాస్ షోలో తాజాగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న జెస్సీని బిగ్ బాస్ బయటికి పంపించివేశాడు. జెస్సీ కొన్నిరోజులుగా వర్టిగో అనే సమస్యతో సతమతమవుతున్నాడు. దాంతో అనేక టాస్క్ లకు దూరంగా ఉంటున్నాడు. బిగ్ బాస్ ఇంట్లోకి వైద్య నిపుణుడిని పంపించి జెస్సీకి చికిత్స చేయించినా, ఆరోగ్యం మెరుగుపడలేదు.

ఈ నేపథ్యంలో, మరింత మెరుగైన వైద్యసాయం కోసం జెస్సీని షో నుంచి బయటికి పంపించాలని బిగ్ బాస్ నిర్ణయం తీసుకున్నాడు. తన నిర్ణయాన్ని బిగ్ బాస్ జెస్సీకి తెలియజేయగా, ఈ విషయాన్ని జెస్సీ ఇంటి సభ్యులతో పంచుకున్నాడు. ఈ హఠాత్ పరిణామాన్ని వారు ఊహించకపోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు.

జెస్సీతో మొదటి నుంచి ఎంతో సన్నిహితంగా ఉంటున్న షణ్ముఖ్, సిరి పరిస్థితి చెప్పనలవిగాదు. తీవ్ర భావోద్వేగాలతో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు స్టార్ మా చానల్ విడుదల చేసిన ప్రోమోలో చూపించారు.

Jessy
Bigg Boss
Illness
Season-5

More Telugu News